గంజాయి బ్యాచ్‌ అరెస్ట్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. మాదాపూర్‌లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విక్రయాలకు ఉపయోగిస్తున్న ఆటో, బైక్‌ను సీజ్‌ చేశారు. హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా గేట్‌ నంబర్‌–3 వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. అనంతరం వారిని మాదాపూర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించినట్లు సీఐ రమేష్‌ తెలిపారు.

కూకట్‌పల్లిలో మరొకరు..

కూకట్‌పల్లి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ఎం. శ్రవణ్‌ కుమార్‌ను ఎక్సైజ్‌ సిబ్బంది పట్టుకున్నారు. అతడి వద్ద 325 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని కూకట్‌పల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించినట్లు ఈఎస్‌ఆర్‌ ప్రవీణ్‌ తెలిపారు.