గంగపుత్ర సమావేశం
జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో గంగపుత్ర సమావేశం ఏర్పాటు చేసారు రాష్ట్ర మత్సకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రులు వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy), వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఏఐసీసీ జూబ్లీహిల్స్ ఇంచార్జి విశ్వనాథన్ హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున గంగపుత్రులు హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం ఆనాడు కాకా కృషి చేస్తే.. ఇవాళ వివేక్ వెంకట స్వామి కృషి చేస్తున్నారు. ఇవాళ షేక్ పేట్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం ఆమోదం తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో మోడర్న్ ఫిష్ మార్కెట్ తో దాదాపు 400 కుటుంబాలకు మేలు జరుగుతుందని గుర్త చేశారు.
షేక్ పేట్ లో మరో ముషీరాబాద్ (Mushirabad) ఫిష్ మార్కెట్ కావాలంటే…. మనం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని.. మనం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి.. సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలి అన్నారు. ఇక్కడ ఇంచార్జిగా ఉన్న మంత్రి వివేక్ కు అండగా నిలవాలి. ఎక్కడో ఉన్న నాకు…. గంగ పుత్రులకు అండగా ఉండాలని… నన్ను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసారని… నా మీద నమ్మకం ఉంచి… రేవంత్ అన్న నాకు అవకాశం ఇచ్చారు… ఒక కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. షేక్ పేట్ లో గంగపుత్రులవి 3 వేల కుటుంబాలు ఉన్నాయి. మేమంతా మీకు అండగా ఉంటాము. ఇక్కడ ఏర్పాటు చేసే ఫిష్ మార్కెట్ కు ముఖ్య కారకులు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ అని మెట్టు సాయికుమార్ తెలియచేశారు.

