బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా గంగాధర్ గౌడ్
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బొంగు గంగాధర్ గౌడ్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అనుముల భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ నియామకం చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అనుముల భాస్కర్.. గంగాధర్ గౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన గంగాధర్ గౌడ్‌ను జిల్లా, మండల నాయకులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు మొయినుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, జిల్లా జాయింట్ సెక్రటరీ అంబుదాస్, సోన్ మండల అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్, కోశాధికారి ఆడేలు, కడెం మండల అధ్యక్షుడు కోల నరేష్, నాయకులు కొంతం సాగర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
