గాంధీజీ అహింసా మార్గం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. ఎమ్మెల్యే..

గాంధీజీ అహింసా మార్గం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం.. ఎమ్మెల్యే..

బంటుమిల్లి – ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం బంటుమిల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని, హింసతో ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించదని, శాంతియుత పోరాటం ద్వారానే స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చని ఆయన నిరూపించారని తెలిపారు.

గాంధీజీ ఆశయాలు చిరస్మరణీయమని, ఆయన కలలుగన్న స్వచ్ఛమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలతో ముందుకు సాగుతోందని తెలిపారు.