గర్భిణీలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలి

గర్భిణీలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలి
- అంగన్ వాడీ కేంద్రంలో శ్రీమంతం కార్యక్రమం
- పాల్గొన్న మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న
మోత్కూర్, ఆంధ్రప్రభ ; గర్భిణీ మహిళలు ప్రతిరోజు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని,తద్వారా మాతా శిశుమరణాల రేటు తగ్గించవచ్చని మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట అంగన్ వాడీ 1 వ సెంటర్ లో ఆరోగ్య లక్ష్మీ పథకం లో భాగంగా గర్భిణీలకు నిర్వహించిన శ్రీమంతం కార్యక్రమంలో చైర్మన్ స్వప్న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వప్న మాట్లాడుతూ గర్భిణి లు నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రక్తహీనతను పెంపొందించవచ్చని, సాధారణ కాన్పులు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అంగన్ వాడీ కేంద్రంలో గర్భిణిలకు ఇచ్చే పౌష్టికాహారం, గుడ్లు, పాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికై తొలిసారిగా తమ అంగన్ వాడీ కేంద్రానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న,9,11 వ వార్డ్ కౌన్సిలర్లు బీసు శ్రీకాంత్ గౌడ్ , కారుపోతుల వెంకన్న లను సిడిపిఓ యామిని,అంగన్ వాడి సూపర్ వైజర్ జ్యోతి లు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ డి సునీత, ఆశా కార్యకర్త నవనీత,గర్భిణీ స్త్రీలు ,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
