లింబాద్రి గుట్టపై గెస్ట్ హౌస్‌కు నిధులు మంజూరు…

భీమ్‌గల్ రూరల్, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై అతిథిగృహ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

టూరిజం శాఖ నిధుల నుండి రూ.4 కోట్లు కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఈ గెస్ట్ హౌస్‌ నిర్మాణం పూర్తయితే భక్తులకు, పర్యాటకులకు సౌకర్యాలు మరింతగా అందుబాటులోకి రానున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply