Fundraising | శభాష్ కలెక్టర్..
- సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా విరాళం
- గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న కలెక్టర్ వినోద్ కుమార్
Fundraising | బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : సాయుధ దళాల పతాక విరాళాల సేకరణలో బాపట్ల జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదగా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ప్రశంసా పత్రం, మెమోంటో అందుకున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న జరుపుకునే సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో సైనికుల శౌర్యం, విధి పట్ల అంకిత భావం అత్యున్నత స్థాయి నైపుణ్యానికి అభివందనం తెలుపు సందర్భంగా బాపట్ల జిల్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా నుంచి రూ.16 లక్షల 80 వేలు సేకరించి విరాళంగా అందజేశారు. విరాళాల సేకరణలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
ఈ మేరకు లోక్ భవన్ దర్బార్ హాల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ ప్రశంసా పత్రం, మోమెంటో అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అవార్డు అందుకోవడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

