Anant Ambani | రాయలసీమ ఉద్యాన హబ్‌కు పూర్తి సహకారం..

Anant Ambani | రాయలసీమ ఉద్యాన హబ్‌కు పూర్తి సహకారం

Anant Ambani | మదనపల్లె, ఆంధ్రప్రభ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యాన హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ) శంకుస్థాపన కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్ అంబానీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. రాయలసీమ ఉద్యాన హబ్‌ ఏర్పాటులో రిలయన్స్‌ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు. ఐఎస్‌ఏ అభివృద్ధికి తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్ర బిడ్డగా భావించి రాష్ట్రానికి మరింత సహకారం అందించేలా మార్గనిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. వ్యవసాయం, ఉద్యాన రంగాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు రిలయన్స్‌ సిద్ధంగా ఉందని తెలిపారు.