పిల్లల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పూర్తి సహకారం

గోవిందాపూర్ సర్పంచ్ దాసి స్వాతి శ్రావణ్ కుమార్

విద్యార్థులు బ్రేక్‌ఫాస్ట్‌ను సద్వినియోగం చేసుకుని ఏకాగ్రతతో చదువుకోవాలి
పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ వద్దు

హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ: పిల్లల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని గోవిందాపూర్ సర్పంచ్ దాసి స్వాతి శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు బ్రేక్‌ఫాస్ట్‌ను సద్వినియోగం చేసుకుని ఏకాగ్రతతో చదువుకోవాలని సూచించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే పౌష్టికాహారం విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కలువాల నరేందర్, ప్రధానోపాధ్యాయురాలు అనిత, ఉపాధ్యాయురాలు రజిత తదితరులు పాల్గొన్నారు.