అమరావతి : ఏపీ మహిళలకు (AP women) స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ స్కీమ్ (SthreeShakti Scheme) ప్రారంభిస్తోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. స్ర్తీ శక్తి పథకాలన్ని ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) నాయుడు జెండా ఊపి ప్రారంభించనుండగా ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రారంభిస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
‘స్త్రీ శక్తి’ పేరిట ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు (FreeBus) ప్రయాణం కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) లో ఉన్న 5 కేటగిరీలకు చెందిన బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వాటిల్లో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించారు. మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్ జెండర్లు కూడా తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చు.
అదే సమయంలో తిరుమల-తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో (Saptagiri buses) మాత్రం ఉచిత ప్రయాణం వర్తించదు. వాటితో పాటు నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణం వర్తించదని ప్రభుత్వ స్పష్టం చేసింది. ఇక ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఇతన క్యాటగిరిలకు చెందిన సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ‘స్త్రీ శక్తి’ పథకం వర్తించదు.
ఇక ‘స్త్రీ శక్తి’ పథకం ఈ నెల 15 నుంచి అమల్లోకి రానుండడంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ (orders Issuance) చేసింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆదేశిస్తూ.. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే (Kantilal Dande) ఉత్తర్వులు జారీ చేశారు.