Free Schemes | ఉచితాల‌తో ప్రజలను ప‌రాన్న‌జీవులుగా మారుస్తున్నారు… సుప్రీం కోర్టు

ఉచిత రేష‌న్ తో ప‌నులు చేయ‌డం లేదు
ఓట‌ర్ల‌ను ఈ ఉచితాల‌తో ప్ర‌లోభ‌పెడుతున్నారు
దీనిని క‌ట్ట‌డి చేయాల్సిందే
ఈసికి, కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ – ప్రజలకు ఉచితంగా రేషన్ , డబ్బులు ఇవ్వడంతో వారు పని చేయడానికి ఇష్టపడటం లేదని.. ఇటువంటి ఉచితాలతో వారిని పరాన్న జీవులు గా మారుస్తున్నారని సుపీం కోర్టు ఫైర్ అయింది. ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలు తీవ్రమైన సమస్య అని కామెంట్‌ చేసింది. దీన్ని ఎలా కట్టడి చేస్తారో సమాధానం చెప్పాలని కేంద్ర‌ ఎన్నికల సంఘం , కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.


పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ పలువురు సుప్రీం కోర్టు‌ను పలువురు ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ అగస్టీన్ ల‌తో కూడిన‌ ద్విస‌భ్య ధ‌ర్మాసనం నేడు విచార‌ణ చేప‌ట్టిన సంద‌ర్భంలో ఉచిత స్కీమ్ లపై కీలక కామెంట్స్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయ‌ని, ఇది ప్ర‌జాస్వామిక విలువ‌ల‌ను విఘాతం క‌లిగిస్తున్న‌దంటూ వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *