పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం

పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం
టేకుమట్ల,ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల పేదల ఆరోగ్యం కోసమే శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్లో శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ రజిత రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం అజాగ్రత్తగా వ్యవహరిస్తారని వారికి అవగాహన కల్పించేందుకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమే తెలిపారు.
ఈ శిబిరంలో ప్రజలకు, వృద్ధులకు పిల్లలకు, వైద్య, కంటి, రక్త పరీక్షలు, నిర్వహించి సుమారు 500 మందికి మందులను పంపిణీ చేశారు. అనంతరం ఆ గ్రామ సర్పంచ్ గునిగంటి రజనీ మహేందర్, ఉప సర్పంచ్ కౌడగాని నవీన్, శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మియాపురం హరీష్ కుమార్, ఆ వైద్య బృందానికి శాలువలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం వైద్య బృందం శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి, ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెవి ముక్కు గొంతు నిపుణులు వినిల్ రెడ్డి, లింగయ్య, ఎముకల శస్త్ర చికిత్స నిపుణులు రాజేష్ కూరపాటి, దంత వైద్య నిపుణులు మనోరంజన్ రెడ్డి సృజనా రెడ్డి, పిల్లల నిపుణులు మధుసూదన్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ కుమార్ నాయక్ లో శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మియాపురం హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
