Fraud | సీఎం స్నేహితున్ని అంటూ బెదిరింపులు..

Fraud | సీఎం స్నేహితున్ని అంటూ బెదిరింపులు..

  • ఓ మహిళకు మాయ మాటలు చెప్పి..
  • ఆమె పేరుపై బ్యాంకులో లోన్ తీసుకొని మోసం


Fraud |
నర్సంపేట క్రైమ్, ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండి భారతి కుమారుడు బండి సందీప్ పైన సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమకొండ చౌరస్తాలో లేడీస్ ఎంపోరియం నిర్వహించే జయసుధ పేరుపై రూ.20లక్షలు బ్యాంకు లోన్ (Bank Lone) తీసుకొని ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసి లోన్ చెల్లించకుండా.. ఇంటిపై దాడి చేసి రాధాకృష్ణ జయసుధ దంపతులను కొట్టి… ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను గుంజుకోవడంతో పాటు కారు ఎత్తుకెళ్లిన సంఘటనలో బీఆర్ఎస్ నాయకుడు బండి సందీప్ చింటూ, అతని తల్లి నర్సంపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండి భారతి, బండి రమేష్ తో పాటు మరికొందరిపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply