పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి దర్శించుకున్న టీసీ ప్రకాష్
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన మాజీ రెస్కో చైర్మన్ వనం గంగిరెడ్డి
నల్లచెరువు, ఆంధ్రప్రభ: అహుడా చైర్మన్, ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షుడు టీసీ వరుణ్ పెదనాన్న టీసీ ప్రకాష్ సోమవారం శ్రీమత్ పాలపాటిదిన్నె ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న టీసీ ప్రకాష్‌కు మాజీ రెస్కో చైర్మన్ వనం గంగిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం టీసీ ప్రకాష్ శ్రీ ఆంజనేయస్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వామివారి దర్శనానికి అవసరమైన ఏర్పాట్లను వనం గంగిరెడ్డి సమన్వయం చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు, స్థానిక ప్రముఖులు టీసీ ప్రకాష్‌ను పలకరించారు.
ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, స్వామివారి మహిమ గురించి స్థానికులు వివరించారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని టీసీ ప్రకాష్ పేర్కొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.
టీసీ ప్రకాష్ ఆలయ సందర్శన సందర్భంగా ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రాంతం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. దర్శనం అనంతరం టీసీ ప్రకాష్‌ను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, జనసేన నాయకులు, స్థానిక ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
