gallery| సూక్ష్మ ప్రపంచంలో అబ్బురపరిచే దృశ్యాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఒక చిన్న నీటి బిందువు.. అందులో దాగి ఉన్న అద్భుత ప్రపంచం! కెమెరా లెన్స్ ద్వారా చూస్తే ప్రకృతిలోని సూక్ష్మ దృశ్యాలు కూడా ఎంత అందంగా కనిపిస్తాయో ఈ ఫొటో చాటిచెబుతోంది. స్వచ్ఛమైన నీటి బిందువు నుంచి దాహం తీర్చుకుంటున్న ఓ చీమ.. మరోవైపు ఆప్యాయతను పంచుకుంటున్నట్లుగా కనిపించే రెండు చీమలు.. ఈ చిన్న దృశ్యాన్ని ఓ అందమైన ప్రకృతి కథగా మార్చేశాయి. మాక్రో ఫొటోగ్రఫీ గొప్పతనాన్ని చాటిచెబుతూ ప్రకృతి అందాలను మరో కోణంలో ఆవిష్కరిస్తున్న ఈ చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ అద్భుత చిత్రాలు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ కెమెరా నుంచి జాలువారాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.




