మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి
బిక్షపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో అకాల మరణం చెందిన బిక్షపతి కుటుంబ సభ్యులను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పరామర్శించారు. పరకాల పట్టణానికి చెందిన జర్నలిస్ట్ ఓదెల శివ తండ్రి బిక్షపతి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి వారి నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, బిక్షపతి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిక్షపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ దుఃఖ సమయంలో వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, మాజీ డైరెక్టర్ నక్క చిరంజీవి, బీఆర్ఎస్ నాయకులు బొచ్చు బాబురావు, చక్రి, బండి వెంకటేష్, బోట్ల నరేష్, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
