సీఎం చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే బండారు
నర్సాపురం,ఆంధ్రప్రభ: నర్సాపురం నియోజకవర్గం పర్యటన కు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మర్యాద పూర్వకంగా కలిసారు. పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీతో మొగల్తూరు సభ స్థలికి చేరుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రిని హెలిప్యాడ్ వద్ద కలిసి పూల బొకే అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నియోజక వర్గంలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం చేయాలని, పుష్కర నిధులు పెద్ద మొత్తం లో కేటాయించాలని చంద్రబాబు నాయుడు ను బండారు మాధవ నాయుడు కోరారు. అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాజీ ఎమ్మెల్యే బండారు తో మాట్లాడారు.
