Former Minister | రాజకీయాల్లో స్థాయిని మరిచి…

Former Minister | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వైసిపి నాయకుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అన్ని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి ఈ రోజు పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ… అంబటి నీది నోరా పేడ దిబ్బనా, సభ్యసమాజం తల దించుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి పై మాట్లాడటం ఆయన నీచత్వానికి నిదర్శనం అన్నారు. రాజకీయాల్లో స్థాయిని మరిచి, సంస్కారాన్ని వదిలేసి మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎంపీ మండిపడ్డారు.
గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించనా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ తన పార్టీ నాయకులతో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించి శాంతి భద్రతల సమస్య చూపాలనీ చూస్తోందని ఆమె ఆరోపించారు. వైసీపీ నేత అంబటి సీఎం చంద్రబాబుపై చేసిన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేసులు పెట్టాలని ఎంపీ పిలుపు నిచ్చారు.
