కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి
- బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు గుర్రం రవీందర్
హనుమకొండ/శాయంపేట, ఆంధ్రప్రభ : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గుర్రం రవీందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఉద్యమకారుల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గట్లకానీపర్తి గ్రామానికి చెందిన ఉద్యమ అమరురాలు సోనీ తండ్రి మల్లేష్ తో ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన సమన్వయంతో పని చేసుకుని పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలన తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తప్పు చేశామన్న భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉందని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గజ్జి శంకర్, నిమ్మల మహేందర్, పొడిశెట్టి గణేష్, బగ్గి రమేష్, అడప ప్రభాకర్, బాసని వెంకటేశ్వర్లు, నాగరాజు, పల్లెబోయిన సారయ్య, అరికిల్ల విజయ్, దూదిపాల రాజిరెడ్డి, తరుణ్ గోపి, సాయి, రాకేష్, అర్జల ఆదిరెడ్డి, జూపాక సారయ్య తదితరులు పాల్గొన్నారు.
