అడవులపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ

అడవులపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ

జన్నారం,ఆంధ్రప్రభ: ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డోన్ల ద్వారా ఇకపై అడవుల్లో పర్యవేక్షణ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ ఇందనపల్లి ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణ తెలిపారు. రేంజ్ పరిధిలోని అడవుల్లో హైదరాబాద్ జీఎస్ఐ ప్రతినిధి రవికిరణ్ శనివారం స్థానిక అటవీ అధికారులకు క్షేత్రస్థాయిలో డ్రోన్ల ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ, డోన్ల ద్వారా అటవీ పర్యవేక్షణ సులభం అవుతుందన్నారు. చెట్లను నరికె వారిని,అక్రమ రవాణా చేసే వారిని, ఇసుక రవాణా చేసేవారిని కనుగొనవచ్చని ఆయన చెప్పారు. వన్యప్రాణుల కదలికలు,అటవీ మంటలు సంభవిస్తే వెంటనే కనుగొనవచ్చని ఆయన తెలిపారు. అడవుల్లో రాత్రి వేళల్లో థర్మల్ సిగ్నేచర్ ద్వారా డ్రోన్లు పనిచేస్తాయని ఆయన చెప్పారు.

Leave a Reply