Forbes 2025 | ముకేష్ అంబానినే అప‌ర కుబేరుడు – ఆస్తిప‌రులు జాబితాను విడ‌ద‌ల చేసిన ఫోర్బ్స్

ముంబై – మన దేశంలో అత్యంత ధనవంతుడిగా (richest in India )మళ్ళీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (reliance Industry ) చైర్మన్ ముకేశ్ అంబానీ (mukesh ambani) ముందున్నారు. ఆయన మొత్తం ఆస్తి సుమారు 115.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9.5 లక్షల కోట్లు). దీనితో ఆయన ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మారారు.

ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఫోర్బ్స్ పత్రిక 2025 జూలై నెలకు సంబంధించిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్ర‌కారం భారతదేశంలో ధనవంతులలో ముకేశ్ అంబానీ తర్వాత రెండో స్థానంలో గౌతమ్ అదానీ(gautam adani ) ఉన్నారు. ఆయన ఆస్తి సుమారు 67బిలియన్ డాలర్లు. అదానీ గ్రూప్ వ్యాపారాలు ముఖ్యంగా ఎనర్జీ, పోర్టులు, పెద్ద ప్రాజెక్టుల రంగంలో బాగా విస్తరించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆయనను ఒక ముఖ్యమైన వ్యక్తిగా చేశాయి. గతంలో కొన్ని సమస్యలు ఎదురైనా, ఆయన ఇప్పుడు మళ్ళీ టాప్ 2లో ఉన్నారు. మూడో స్థానంలో టెక్నాలజీ రంగంలో ప్రముఖులైన హెచ్‌సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (siva nadar ) ఉన్నారు. ఆయన ఆస్తి సుమారు 38.0 బిలియన్ డాలర్లు.

ఇక భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ సావిత్రి జిందాల్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తి సుమారు 37.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టాప్ 10 జాబితాలో దిలీప్ సంఘ్వి (సన్ ఫార్మా), సైరస్ పూనవాలా (సీరం ఇన్‌స్టిట్యూట్), కుశాల్ పాల్ సింగ్ (డీఎల్‌ఎఫ్), కుమార్ మంగలం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్), రాధాకిషన్ దమానీ (డీమార్ట్) వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. పదవ స్థానంలో లక్ష్మీ మిట్టల్ (ఆర్సెలర్ మిట్టల్) నిలిచారు.

Leave a Reply