పట్టణ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు..!

పట్టణ అభివృద్ధికి రూ. 15 కోట్ల నిధులు..!

ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అదిలాబాద్(Adilabad) పట్టణ అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పట్టణ అభివృద్ధి నిధుల మంజూరి ఉత్తర్వు కాపీని ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు అందజేశారు. ఈ నిధులతో గత మే నెలలో ప్రతిపాదించిన 52 అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పాయల శంకర్(MLA Payala Shankar) తెలిపారు.

ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు గాంధీ పార్క్ సుందరీకరణ పనులు చేపడుతామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రూ. 15 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply