Warangal | ప్రాణాలు గుప్పిట్లో…

Warangal | ప్రాణాలు గుప్పిట్లో…

కదిలిన గూడ్స్ రైలు..తప్పిన ప్రమాదం
ఘటనపై రైల్వే అధికారులు విచారణ

Warangal | కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో(Railway Station) నిలిచిన గూడ్స్ రైలు క్రింది నుండి ఓ వ్యక్తి వెళ్లే ప్రయత్నంలో ఆ రైలు కదలగ సమయస్ఫూర్తితో పట్టాల మధ్య పడుకొని ప్రాణాన్ని దక్కించుకున్న సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. కేసముద్రం రైల్వే స్టేషన్ సెకండ్ ఫ్లాట్ ఫామ్(Second Platform) నుండి అమినాపురంకు వెళ్లేందుకు ఓ గుర్తు తెలియని యువకుడు కొత్తగా నిర్మించిన మూడవ లైన్ పై నిలిచి ఉన్న గూడ్స్ రైలు క్రింది నుంచి దూరి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

రైలు ఒక్కసారిగా కదలడంతో భయంతో పట్టాల మధ్యలో పడుకొని ఉండి పోయాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్న ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు అరిచేసరికి రైలు వెంటనే ఆగిపోయింది. దింతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది పరుగున చేరుకుని అతడిని సురక్షితంగా వెలికితీశారు.

కాగా కొత్తగా నిర్మించిన మూడవ లైన్ పూర్తి అయి కొన్ని నెలలు కావస్తున్నా రెండవ ప్లాట్ ఫామ్ కు వచ్చే ప్రయాణికులకు (అమినాపురం వైపుగా ఉన్న ప్రయాణికులకు రాకపోకలు ఇబ్బందిగా మారాయి) ఇబ్బందిగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు ఫస్ట్ ప్లాట్ ఫామ్ నుండి కొత్తగా నిర్మించిన మూడవలైన్‌ దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్(Foot over bridge) పొడిగింపు నిర్మాణం చేపట్టారు.

కానీ అసంపూర్తిగా ఉండడంతో పైకి ఎక్కి రావడానికి ఇబ్బందిగా మారింది. దీంతో ప్రయాణికులు రెండవ ప్లాట్ ఫామ్ కు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ మూడవ లైన్ పట్టాలు దాట‌డం, లేదా ఆ పట్టాల పై ఏదైనా గూడ్స్ రైలు(goods train) ఉంటే దూరి దాడ‌డం లాంటి ప్రయత్నాలు చేస్తూ ట్రైన్ ఎక్కకెందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ త‌తంగం జరుగుతున్నా చూస్తూ సంబంధిత అధికారులు నిమ్మకు నీరేత్తినట్లు చూస్తున్నారే తప్ప త్వరగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలనే ఆలోచన చేయడం లేదన్నది ఇప్పుడు జరిగిన సంఘటనకు నిదర్శనం.

Leave a Reply