అంగనవాడి కేంద్రంలో అస్వస్థకు గురైన చిన్నారులు

అంగనవాడి కేంద్రంలో అస్వస్థకు గురైన చిన్నారులు
- ఫుడ్ పాయిజన లేక ఇంకా ఏ ఇతర కారణమా ?
- టెస్టులు వస్తే కానీ ఏమైందో చెప్పలేమంటున్న వైద్యులు
- ఇద్దరు రికవరీ ముగ్గురిని భద్రాచలం ఆస్పత్రికి తరలింపు
వీఆర్ పురం పోలవరం జిల్లా, ఆంధ్రప్రభ : పోలవరం జిల్లా విఆర్ పురం మండలంలోని నూతిగూడెం అంగన్వాడి కేంద్రంలో ఎనిమిది మంది చిన్నారులు ఉండగా వారిలో ఐదుగురు ఉన్నట్టుండి అస్వస్థకు గురయ్యారు చిన్నారులను కోతులు గుట్ట ఆసుపత్రికి తరలించారు. అక్కడనుండి ముగ్గురు పరిస్థితి కొంతవిషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఫుడ్ శాంపిల్స్ వాటర్ శాంపిల్స్ నుటెస్టులకి పంపించామని విఆర్ పురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి మల్లిక మంగళవారం తెలిపారు. ఈ విషయమై ఆంధ్రప్రభ ఆమెను వివరణ కోరగా ఇద్దరు ఈరోజు డిశ్చార్జి అవుతారని ముగ్గురు భద్రాచలంలో కోరుకుంటున్నారని వారిలో రామ్ తేజ ,నవనీత్, తేజస్ గురు కూడా రికవరీ అవుతున్నట్లు తెలిపారు. కోతులు గుట్ట సిహెచ్సిలో చికిత్స పొందుతున్న వర్షిని, రోహిత్ డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.
ఓకే అంగన్వాడి సెంటర్ లో ఇలా ఎందుకు జరిగింది
మంగళవారం రోజు ఒక విద్యార్థికి వాంతులు అవడంతో బాధితులు కోతులు గుట్ట ఆసుపత్రికి తరలించారు. బుధవారం మరో నలుగురికి అదే విధంగా అస్వస్థత గురై వాంతులు అవడంతో వారిని వదులు గుట్ట రిపేర్ చేసి అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
నిల్వ పాలు నిల్వ ఉంచిన గుడ్లు తినడం వలన ఫుడ్ పాయిజన్ అయిందా లేదా వాటర్ వలన ఇలా జరిగింది అనే కోణంలో అన్ని శాటిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు కోతులు కొత్త వైద్యాధికారులు వెల్లడించారు. ఏది ఏమైనా అంగన్వాడి కేంద్రాల్లో ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేక కావటం వలన నిల్వ ఉంచిన గుడ్లు పాలు ఇవ్వడం ఇలా జరుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకపై అన్ని అంగన్వాడి కేంద్రాలలో నిర్వహించిన కోడిగుడ్లు పాలు ఇతర పౌష్టికాహారం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రత్యేక మెగా పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని చిన్నారులు తల్లిదండ్రులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
