food delivery | సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వాసవినగర్‌లో ఘటన..

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వాసవినగర్‌లో ఘటన..

సికింద్రాబాద్‌, ఆంధ్రప్రభ : ఫుడ్‌ డెలివరీ ఆలస్యమైందన్న కారణంతో ఓ డెలివరీ బాయ్‌పై దంపతులు దాడికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వాసవినగర్‌లో చోటుచేసుకుంది. జొమాటోలో ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ను తీసుకెళ్లేందుకు డెలివరీ బాయ్‌ ఆశి బయలుదేరాడు. అయితే ఆర్డర్‌ చేసిన లొకేషన్‌ సరిగ్గా చూపించకపోవడంతో డెలివరీ ఆలస్యమైనట్లు సమాచారం. దీంతో ఫుడ్‌ కోసం ఎదురుచూస్తున్న దంపతులు డెలివరీ బాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దారుణంగా దాడికి పాల్పడ్డారు. తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేసినా.. వెంటాడి, కిందపడేసి మరీ ఘోరంగా చితకబాదారు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో దంపతులు ఆశిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

పోలీసుల దర్యాప్తు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, ఇరువర్గాల వాదనలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.