వాహనదారులను ఆగం చేసింది
ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : నిర్మల్ (Nirmal ) జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి, తర్లపాడు, ఎల్లాపూర్ సహా పలు గ్రామాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు పొగమంచు (Dense Fog) కమ్మేసింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందున్న వాహనాలు (Vehicle) స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకుంటూ నెమ్మదిగా వాహనాలను నడిపారు. పొగమంచు ప్రభావం కొంతసేపటికి తగ్గినా, ఉదయం రాకపోకలకు అంతరాయం కలిగింది.

