13 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

13 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

గోదావరిఖని (ఆంధ్రప్రభ) : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విస్తారమైన వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది. బుధవారం రోజున ఎల్లంపల్లి ప్రాజెక్టు (Ellampalli Project) కు సుమారుగా లక్ష క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న కారణంగా శ్రీ పాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది.

ఇన్ ఫ్లో : లక్ష క్యూసెక్కుల నీరు
అవుట్ ఫ్లో : 105157 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం : 148 (మీటర్లు)
ప్రస్తుత నీటి మట్టం : 147 (మీటర్లు)
పూర్తి స్థాయి నీటి నిల్వలు: 20.175 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వలు : 20.175 టీఎంసీలు

మొత్తంగా ఇన్స్టంట్ ఇన్ఫ్లో : లక్ష క్యూసెక్కులు
13 గేట్లను ఎత్తి 105157 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాభావం ఎక్కువైతే ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉన్నట్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు చెప్తున్నారు. మొత్తం గేట్లు : 62, ఎత్తిన గేట్లు : 13

నీటి విడుదల..
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై : 288 క్యూసెక్కులు
శ్రీరామ్ సాగర్ (ఎస్సారెస్పీ): 50000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుతుంది.
కడెం ప్రాజెక్టు నుండి : 4744 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుంది.

సుందిళ్ల పార్వతి బ్యారేజ్ :
ఇన్ఫ్లో : 12151 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 12151 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం : 130 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం : 119.59 మీటర్లు
బ్యారేజీ నీటి సామర్థ్యం : 8.83 టీఎంసీలు
సుందిళ్ల పార్వతి బ్యారేజ్ కి సంబంధించిన మొత్తం 74 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడిచి పెడుతున్నారు.

Leave a Reply