న్యూ ఢిల్లీ |నేడు జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్కోట్లకు బయలుదేరే విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. సోమవారం రాత్రి 11:38 గంటలకు సోషల్ మీడియా పోస్ట్‌లో ఎయిర్ ఇండియా కంపెనీ ఒక ప్రకటనలో, కొత్త పరిణామాల దృష్ట్యా, ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తున్నామన్నారు.
జమ్మూ, అమృత్సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్కోట్లకు బయలుదేరే విమానాల సర్వీసు లు రద్దు చేసినట్లు తెలిపింది..
తమ బృందం పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని ఎయిర్‌లైన్ తెలిపింది. భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన తర్వాత సోమవారం పౌర విమానాల కోసం తిరిగి తెరిచిన విమానాశ్రయాలలో ఈ ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. అమృత్‌సర్‌లో ముందుజాగ్రత్త బ్లాక్అవుట్ చర్యలు అమలు చేసిన తర్వాత సోమవారం సాయంత్రం అమృత్‌సర్‌కు వెళ్లే ఇండిగో విమానం దేశ రాజధానికి తిరిగి వచ్చిందని వర్గాలు తెలిపాయి
భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో 75 నిముషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణీకులు భద్రతా తనిఖీలు చెక్ ఇన్ ఫార్మాలిటీప్ పూర్తి చేసుకోవడానికి సమయానికి ముందే తమ తమ విమానాశ్రయాలకు చేరుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగోతో పాటు స్పైస్‌జెట్ విజ్ఞప్తి చేశాయి.