మత్స్యకారుల నేత చెన్ను గురుమూర్తి మృతి..

మత్స్యకారుల నేత చెన్ను గురుమూర్తి మృతి..

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : జాతీయ మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విభాగం కార్యనిర్వహక అధ్యక్షుడు చెన్ను గురుమూర్తి (58) గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. భార్య కొంత కాలం క్రితమే మరణించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అవనిగడ్డలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Leave a Reply