Nellore | సురక్షితంగా తీరానికి…
Nellore | సురక్షితంగా తీరానికి…
Nellore | నెల్లూరు, ఆంధ్రప్రభ: సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నారు. సముద్రంలో అలల ఉద్ధృతి పెరగడంతో పడవతో సహా సముద్రంలో నిలిచిపోయారు. చివరకు స్థానిక మత్స్యకారుల సహాయంతో పాత కడపలి తీరానికి చేరుకున్నారు.
నిజాంపట్నం తీర ప్రాంతానికి చెందిన కొందరు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఈ క్రమంలో ‘మురసు’ తుపాను ప్రభావంతో సముద్రంలో అలల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. భారీ అలలు ఎగసిపడుతుండటంతో వారు ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో తీరానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పడవను నిలిపివేశారు. ప్రమాదకర పరిస్థితులను గుర్తించిన స్థానిక మత్స్యకారులు వారికి సహాయం అందించారు. వారి సహకారంతో మత్స్యకారులు పాత కడపలి తీరానికి చేరుకున్నారు.
