Breaking News | 20 మంది సజీవదహనం…

42 మంది సిబ్బందితో ఉన్న కార్గో నౌకలో భారీగా చెలరేగిన మంటలు


Breaking News | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చైనాలోని ఓ పోర్టులో నిలిపి ఉంచిన ‘ఓషియన్ మెలోడీ’ అనే కార్గో నౌకలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌకలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 42 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అగ్నిప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు, సహాయక చర్యలకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రమాదంపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.