మహారాష్ట్ర | ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగడంతో 8మంది మృతిచెందిన విషాద ఘటన మహారాష్ట్ర లో చోటుచేసుకుంది. నాగుర్ జిల్లా ఉమ్రేర్ లోని అల్యూమినియం ఫాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8మంది మృతిచెందారు. మరికొంత మందికి తీవ్రగాయాలు కాగా… వారిని నాగ్‌పుర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.