fire hazard | అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం…

fire hazard | అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం…
fire hazard | విజయవాడ (కార్పొరేషన్), ఆంధ్రప్రభ : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలతో అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శనివారం ఉదయం విశ్వ వాణి స్కూల్, పటమట, అనురాధ హాస్పిటల్, ఎలక్ట్రికల్ హై టెన్షన్ లైన్, భారతి నగర్ ను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది.
ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానం, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్ ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేం ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.


