ఇల్లు దగ్ధం..

ఇల్లు దగ్ధం..

  • గ్యాస్‌ లీక్ కావడంతో చెలరేగిన మంటలు

మంగపేట, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండరు లీకేజి కావడంతో మంటలు చెలరేగి ఓ ఇల్లు పాక్షికంగా దగ్ధమైన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శనిగకుంట గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనిగకుంట గ్రామానికి చెందిన ఇరుప అపర్ణ – హనుమంతు దంపతులు గడ్డి ఇంటిలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఇరుప అపర్ణ ఇంటిలో వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయి ఒక్క సారిగా మంటలు చెలరేగి గడ్డి ఇల్లు అంటుకుంది.

దీంతో ఇరుప అపర్ణ – హనుమంతు దంపతులతో పాటు చుట్టుప్రక్కల ఇండ్ల వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా కొద్ది సేపటికి మంటలు అదుపులోకి వచ్చాయి. కాగా అప్పటికే ఇంట్లో ఉన్న వంట సామగ్రి పూర్తితో పాటు బట్టలు, ఇతర సామాగ్రి కాలిపోయాయి. ఈ ఘటనలో ఒక లక్ష రూపాయలు వరకు నష్టం వాటిల్లినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఇల్లు కాలిపోవడంతో తమ కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని భాదిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Leave a Reply