భయంతో ఉద్యోగులు, కార్మికులు పరుగులు

  • పరిశ్రమలోని ప్రొడక్షన్ విభాగంలో అగ్ని ప్రమాదం


నాయుడుపేట (ఆంధ్రప్రభ) : తిరుపతి (Tirupati) జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్ లో అరబిందో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని ప్రొడక్షన్ విభాగం (Production Department) లో ఒక్కసారిగా గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఏమి జరిగిందో తెలియక ఎగిసిపడుతున్న మంటలను చూసి భయంతో కార్మికులు, ఉద్యోగులు (Workers and employees) పరుగులు తీశారు.

పరిశ్రమ ద్వారా వెలువడుతున్న మంటలను చూసి స్థానికులు సైతం ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన ఎన్నో భారీ పరిశ్రమలు (Heavy industries) ఏర్పాటు చేసి ఉన్నా, మేనకూరు సెజ్ లో ఇలాంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి.

ఆయా పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు (Workers) ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. ఈ సంఘటనతో స్థానిక ఉద్యోగులు కార్మికుల్లో ఆందోళన రేకెత్తుతోంది.

Leave a Reply