Fire | జాతీయ రహాదారిపై కారు దగ్ధం

Fire | జాతీయ రహాదారిపై కారు దగ్ధం
Fire | సదాశివనగర్, ఆంధ్రప్రభః హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు మంటల్లో దగ్దమైనట్లు స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని పద్మాజి వాడి గ్రామ సమీపంలో మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి మీదుగా నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి ఎస్సై ఎం.పుష్పరాజ్ చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పి, ట్రాఫిక్ ను నియంత్రించారు.
