అమ్మవారి సేవలో త‌రించండి

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : స్థానిక కనకా పరమేశ్వరీ దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 వ తేదీ వ‌ర‌కు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కార్యదర్శి మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ విలేక‌రుల స‌మావేశ‌లో ఆదివారం తెలియజేశారు.

ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్క‌రించారు. దేవాలయంలో నిత్య విశేష కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు ప్రతిరోజు అమ్మవారి అలంక‌ర‌ణ‌, సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయ‌ని నిర్వాహకులు తెలిపారు.