బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం..

కుంటాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఓలా గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ స్తంభించి ఊరే విట్టాబాయి ఇల్లు దగ్ధమైంది. మంటలు వ్యాపించి పొగ కమ్ముకుంది. దీంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. అయితే.. కుంటాల మాజీ ఎంపీపీ జీవీ రమణారావు తన వంతు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మరింత సాయం అందించేందుకు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దృష్టికి తీసుకువెళ్లి ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తానని ఆయన బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కట్ట రవి, వీడీసీ అధ్యక్షులు ఎగ్గం నర్సింలు, సీనియర్ నాయకులు సదాశివ పటేల్, సుదర్శన్ పటేల్, మల్లేష్ రాందాస్, లింగం, నాగులపల్లి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply