మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

  • మాడుగుల సత్తయ్య మృతికి సర్పంచ్‌ యాదమ్మ వెంకటయ్యగౌడ్‌ సంతాపం
  • కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత

వెల్దండ, ఆంధ్రప్రభ: వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ మట్ట యాదమ్మ వెంకటయ్యగౌడ్‌ సత్తయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఎర్ర శ్రీను, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్‌, పాలాది మల్లీశ్వరి, రంగనాథం, మారెపల్లి శ్రీను, మంజుల, కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తిరుపతిరెడ్డి, దర్గయ్య, కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ అధ్యక్షుడు మట్ట భరత్‌గౌడ్‌, మట్ట మల్లేష్‌గౌడ్‌, ఈదులపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.