నిరుపేద కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన గంపల మల్లేష్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ‘మన వెల్లంపల్లి’ వాట్సాప్ గ్రూప్ సభ్యులు ముందుకు వచ్చారు. గ్రూప్ ద్వారా విరాళాలు సేకరించి మొత్తం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని మల్లేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ మల్లేష్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తమవంతు సహాయం అందించామని తెలిపారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన గ్రూప్ సభ్యులను గ్రామస్థులు అభినందించారు.
