Financial assistance | పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం

Financial assistance | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామానికి చెందిన పార్కిన్సన్ వ్యాధితో చికిత్స పొందుతున్న జంధ్యాల వెంకట కృష్ణ కుమార్ కు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి నుండి మంజూరు చేసారు. చెక్కును టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి కృష్ణ కుమార్ కుమారుడికి అందించారు. ఈ సందర్భంగా మెంటే పార్థసారథి మాట్లాడుతూ పౌరహిత్యం ద్వారా జీవనోపాధి పొందుతూ పార్కిన్సన్ వ్యాధి సోకి అనారోగ్యంతో ఉన్న జంధ్యాల వెంకట కృష్ణ కుమార్ ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి సిఫార్సు ద్వారా 7 లక్షల 50 వేల రూపాయలు చెక్ రూపంలో ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారని తెలిపారు.

ఎఎంసి చైర్మన్ కలిదిండి సుజాత, రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో బుల్లెట్ వేగంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందిస్తూ పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో భీమవరం పట్టణ, రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము చెల్లబోయిన గోవింద్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ళ సీతారామ్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కుమార్, రేవు వెంకన్న, కోళ్ళ నాగబాబు, సీతారామయ్య, తోరం వినాయక్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply