ఆర్థిక సాయం అందజేత..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం పాతమామిడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సలిగంటి రాజయ్య(Saliganti Rajaiah) తల్లి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారిది నిరుపేద కుటుంబమని అదే గ్రామానికి చెందిన మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(Kokkirala Prem Sagar Rao) అభిమానులు రాజయ్యకు 10వేల ఆర్థిక సహాయం ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి చేతుల మీద అందజేశారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఏళ్తపు శ్రీనివాస్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు అరేపల్లీ రమేష్,గ్రామ కమిటీ అధ్యక్షుడు గొట్ల మహేందర్,కంది శంకర్,గెల్లి శ్రీనివాస్,గుర్రాల రమేష్,జంజిరాల పెద్దయ్య, కొప్పుల రవికిరణ్, జుల పెద్ధి రాజ్ తదితరులు పాల్గొన్నారు.

