మెగా డీఎస్సీ తుది జాబితా పై

  • అభ్యర్థులకు అనుమానాలు.
  • కర్నూల్ డీఈఓ నిలదీత .
  • మెరిట్ మార్కులు సాధించిన
  • పోస్టులో రాలేదని అభ్యర్థుల ఆవేదన.
  • జిల్లాలో 2590 పోస్టుల భర్తీ
  • చూపిన ఖాళీలు 2678.
  • భర్తీ కానివి 88 పోస్టులు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీ మెగా డీఎస్సీ(AP Mega DSC) 2025 నియామక‌ ప్రక్రియలో జాబితా వచ్చేసింది. ఈ జాబితాలను ఆన్ లైన్‌తో పాటు డీఈఓ కార్యాలయం ముందు ప్రదర్శించారు. దీంతో ప్రభుత్వం ప్రచురించిన చివరి జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో అని కర్నూలు జిల్లా(Kurnool District) పరిధిలోని పలు ప్రాంతాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు.

ఆ తర్వాత జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మెగా డీఎస్సీలో తాము నష్టపోయామని భావించిన అభ్యర్థులు డీఇఓ కార్యాలయంలో సంప్రదించారు. ప్రచురించిన జాబితాపై చాలా అనుమానాలు ఉన్నాయని పోస్టులు దక్కని అభ్యర్థులు కర్నూలు విద్యాశాఖ కార్యాలయం(Education)లో విద్యాశాఖ అధికారి కే .శ్యాముల్ పాల్‌ను నిలదీశారు. తమ అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. దీంతో కార్యాలయంలో గందరగోళం నెలకొంది.

ముఖ్యంగా ర్యాంకు, మార్కుల పరంగా అర్హత ఉన్నతమకు అన్యాయం జరిగిందంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. పీఈటీ, ఇతర కేటగిరిలతోపాటు స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లు సమగ్రంగా విచారించలేదని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్‌(EWS Category), పీహెచ్‌ కేటగిరీ(PH Category)ల్లో అనర్హులకు అందలం ఎక్కించారన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా(Sports Quota)లో 49 పోస్టులను చూపి, కేవలం 43 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని అభ్యర్థులు డీఈఓ ని నిలదీశారు.

మిగిలిన 6 పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదని అడుగుతే.. 49 పోస్టులు భర్తీ చేయాలని పంపిన తమకు ఏపీ షాప్ నుంచి 43 మంది జాబితా మాత్రమే వచ్చిందని, ఆ మేరకు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఆ పోస్టులను భర్తీ జరిగినట్టు వివరించారు.

  • 2590 మందికే అవకాశం

రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సోమవారం ప్రచురించిన మెగా డీఎస్సీ తుది జాబితాలో 2590 మంది ఎంపికై నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్‌లలో 2678 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌(Notification) జారీచేశారు. ఈ ప్రక్రియ తుది జాబితా ప్రచురణ నాటికి పలు కేడర్‌లలో 2590 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు.

88 పోస్టులకు అభ్యర్థులు లేరని ప్రకటించారుతుది ఎంపిక జాబితాలను కలెక్టరేట్‌, డీఈవో కార్యాలయ నోటీసు బోర్డులలో ప్రచురించారు. తుది జాబితా(list)లో అభ్యర్థులకు ఎవరైనా అభ్యంతరాలున్నట్లైతే కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ నెంబర్‌లో తెలియజేయాలని డీఈవో కే. శ్యాముల్ పాల్ తెలిపారు.

Leave a Reply