• గాంధీ మెడిక‌ల్ క‌ళాశాల‌కు సుర‌వ‌రం పార్థివ దేహం
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్ర‌బాబు నివాళులు
  • మగ్దూం భవన్ నుంచి క‌న్నీటి వీడ్కోలు

హైద‌రాబాద్ బ్యూరో : సీపీఐ జాతీయ మాజీ కార్య‌ద‌ర్శి, న‌ల్ల‌గొండ మాజీ ఎంపీ సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి అంతిమ యాత్ర ముగిసింది. హిమ‌యాత్ న‌గ‌ర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాల‌యం మ‌గ్గూం భ‌వ‌న్ నుంచి ప్ర‌భుత్వ లాంఛ‌న‌ల‌తో అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది.

అక్క‌డ నుంచి గాంధీ మెడిక‌ల్ క‌ళాశాల వ‌ర‌కూ యాత్ర అంన‌త‌రం గాంధీ మెడిక‌ల్ క‌ళాశాల‌కు ఆయ‌న పార్థివ‌దేహాన్ని కుటుంబ స‌భ్యులు డొనెట్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ‌, సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే కూనంనేటి సాంబ‌శివ‌రావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ‌తోపాటు ప‌లువురు సీపీఐ నాయ‌కులు పాల్గొన్నారు.

ప్ర‌ముఖుల నివాళులు…

సీపీఐ జాతీయ మాజీ కార్య‌ద‌ర్శి సుర‌వరం సుధాక‌ర్ రెడ్డి పార్థివ దేహం ఉంచిన మగ్దూం భ‌వ‌న్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. సుధాక‌ర్ పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి పూల‌మాల‌లు వేసిన నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… సురవరం రాసిన లేఖతోనే తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చామని గుర్తు చేశారు.

తాను సురవరంతో మాట్లాడతానని చెప్పానని, కానీ ఇలా రావాల్సి వస్తుందని అనుకోలేదని బాధపడ్డారు. సిద్ధాంతపరమైన రాజకీలను నిర్వహించిన సూరవరం చనిపోవడం తీరని లోటు అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే ఎఐసీసీ, కాంగ్రెస్, తెలంగాణ ప్రభుత్వ పక్షాన సుధాకర్ రెడ్డి మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.

సుధాక‌ర్ పార్థివ దేహానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పుష్ప‌గుచ్ఛాలతో నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. సుర‌వ‌రంతో ఉన్న సంబంధాలు గుర్తు చేసుకున్నారు. హిమాయత్ నగర్ లోని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యాలయం ముగ్ధుమ్ భవన్ సుధాకర్ రెడ్డి గారి పార్ధివదేహానికి పూలమాల వేసి తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీత‌క్క‌) నివాళులు అర్పించారు.

అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నివాళులు అర్పించారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సురవరం మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు కేటీఆర్ తెలిపారు.

Leave a Reply