W – IND vs SA | ఫైన‌ల్ ఫైట్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ భార‌త్ దే !

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 తుది అంకం నేడు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌తో క్రికెట్‌ చరిత్రలో ఒక కొత్త ఛాంపియన్‌ పుట్టబోతోంది. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఆధిపత్యం చెలాయిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో.. ఈసారి భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ఫైన‌ల్ ఫైట్ లో తలపడుతున్నాయి.

నవీ ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో, దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా మైదానం తడి ఉండటంతో తొలుత బౌలింగ్‌ చేయడం అనుకూలంగా ఉంటుందని ఆమె పేర్కొంది.

“వర్షం కారణంగా కొంత స్లిప్పింగ్‌ ఉండొచ్చు. తర్వాత డ్యూ రావొచ్చు. అందుకే ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాం. సెమీఫైన‌ల్లో ఆడిన‌ జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. ఇది మాకు పెద్ద మ్యాచ్‌, పెద్ద అవకాశం,” అని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ అన్నారు.

హర్మన్‌ప్రీత్‌ కౌర్ మాట్లాడుతూ.. మేము కూడా టాస్‌ గెలిస్తే ముందుగా బౌలింగ్‌ ఎంచుకునేవాళ్లం. వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకున్నాం. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌ మొదలు పెడుతున్నాం. ఇది కూడా మంచిదే. స్వేచ్ఛగా ఆడి, స్కోర్ బోర్డుపై మంచి స్కోరు పెట్టే అవకాశం లభించింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత అందరం మళ్లీ ఫోకస్‌తో, ఉత్సాహంతో ఈ ఫైనల్‌ కోసం సిద్ధంగా ఉన్నాం.” అని అన్నారు.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ… మేము టాస్‌ గెలిచినా ముందుగా బౌలింగ్‌ ఎంచుకునేవాళ్లం. వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకున్నాం. కానీ ఇప్పుడు బ్యాటింగ్‌తో ఆరంభించడం కూడా మంచిదే. స్వేచ్ఛగా ఆడి, బోర్డుపై బలమైన స్కోరు పెట్టే అవకాశం ఉంది. సెమీఫైనల్‌ తర్వాత అందరం మళ్లీ ఫోకస్‌ సాధించాం, పూర్తి ఉత్సాహంతో ఈ ఫైనల్‌ కోసం సిద్ధంగా ఉన్నాం,” అని హర్మన్‌ప్రీత్‌ తెలిపారు.

తుది జ‌ట్లు :

భార‌త్ : షఫాలీ వర్మ, స్మృతి మంథానా, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), అమన్‌జ్యోత్‌ కౌర్‌, రాధా యాదవ్‌, క్రాంతి గౌడ్‌, శ్రీ చారణి, రేణుకా సింగ్‌ ఠాకూర్‌

దక్షిణాఫ్రికా : లారా వోల్వార్ట్‌ (కెప్టెన్‌), తజ్మిన్‌ బ్రిట్స్‌, ఆన్నికే బోష్‌, సునే లూస్‌, మారిజాన్‌ కాప్‌, సినాలో జాఫ్టా (వికెట్‌ కీపర్‌), అనెర్రీ డెర్క్సెన్‌, క్లోయ్‌ ట్రయాన్‌, నాడిన్‌ డి క్లెర్క్‌, ఆయాబోంగా ఖాకా, నాంకులులెకో మ్లాబా

Leave a Reply