Final | ఆదేశించినవారే సర్పంచ్ అభర్థులు

Final | చెన్నూర్, ఆంధ్రప్రభ : మూడో విడతలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికల్లో చెన్నూరు, కోటపెల్లి మండలాల అధికార కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను రాష్ట్ర పీసీసీ, జిల్లా డీసీసీ, మంత్రి వివేక్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెన్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుర్మ రాజమల్ల గౌడ్(Kurma Rajamalla Goud) తెలిపారు. పార్టీ ఖరారు అభ్యర్థులు మినహా అధిష్టాన ఆదేశాలను పాటించకుండా ఎవరైనా అభ్యర్థులు పార్టీ అధ్యక్షుల, మంత్రి వివేక్, ఫోటోలు కరపత్రాలతో ప్రచారం చేసినట్లయితే చట్టరీత్యా చర్యలతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచ్చిన అభ్యర్థుల గెలుపు(Candidates win) కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు.
