కాంగ్రెస్ వైఫల్యాలపై పోరుబాట: బీఆర్‌ఎస్
ములకలపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని ఆరు గ్యారంటీలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలపై పోరాడాలని బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ పిలుపు మేరకు, పార్టీ ముఖ్య నేతల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2న అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మండలంలోని 20 పంచాయతీల నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సర్పంచులు తుర్రం శ్రీను, భూక్యా ధర్మ, తానం పద్మ, ముఖ్య నాయకులు తాండ్ర రాంబాబు, బండి కొమరయ్య, మట్ల నాగమణి, పుష్పాల చందర్‌రావు, ఇనగంటి రాము, సూరం పుల్లారావు, పుష్పాల హనుమంతు, వేముల సతీష్, మిర్యాల మధు తదితరులు పాల్గొన్నారు.
