కంచి పీఠం పాఠశాలలో కృష్ణలీలల సందడి
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
సంప్రదాయబద్ధంగా ఉట్టికొట్టిన చిన్నారులు
పాల్గొన్న ప్రధానోపాధ్యాయురాలు విష్ణుభట్ల పద్మావతి, ఉపాధ్యాయినులు
విజయవాడ, ఆంధ్రప్రభ: నగరంలోని సత్యనారాయణపురంలోని శ్రీ కంచి కామకోటి పీఠం సంప్రదాయ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడి బాల్యలీలలను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం సంప్రదాయబద్ధంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విష్ణుభట్ల పద్మావతి, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

