ఎమ్మెల్యేకు సన్మానం

పెద్దపల్లి రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ‌: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కాంప్లెక్స్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న 26 మంది దుకాణదారులు పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావును శివపల్లిలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

తమ సొంత పేర్లపై దుకాణాల అగ్రిమెంట్లు చేయించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దుకాణదారులు మాట్లాడుతూ.. స్వయంగా దుకాణాలు నిర్వహిస్తున్న తమకు సొంత పేర్లపై అగ్రిమెంట్లు చేయించడం ద్వారా భరోసా కల్పించిన ఎమ్మెల్యే విజయరమణారావుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు బూతగడ్డ సంపత్‌తో పాటు దుకాణదారులు అభిలాష్‌, ఫారుక్‌, విష్ణు, ఆంజనేయులు, సుభాన్‌, ఓదెలు, వికాస్‌, రాజు, శేఖర్‌, కుమార్‌, ఉమేష్‌, సురేష్‌, చంద్రమౌళి, రషీద్‌, తదితరులు పాల్గొన్నారు.