అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌కు స‌న్మానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు బీజేపీ ఆధ్వర్యంలో శనివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శాంతినగర్ కొమ్ముగూడ అంగన్‌వాడీ కేంద్రాల్లో మిలన్ సేవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా కౌన్సిల్ సభ్యులు సుమన్ రమేష్ రాథోడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లకు సన్మానం చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు గర్భిణుల‌కు నిస్వార్థ సేవలందిస్తున్న అంగన్‌వాడీ టీచర్ల సేవలను గుర్తించి బీజేపీ ఆధ్వర్యంలో అంగన్ విలన్ సేవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉట్నూర్ బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్ , పట్టణ అధ్యక్షుడు తన్నీరు సతీష్, జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్ , సీనియర్ నాయకులు బానోత్ జగన్ నాయక్, సిపతి లింగాగౌడ్ ,శేషారావు, సల్గర్ రవీందర్, కనక విజయ్ హరిప్రసాద్ పులి శ్రీకాంత్ అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.